అత్యాచారం చేసి బెల్టుతో తీవ్రంగా కొట్టారు ,60 ఏళ్ల తర్వాత బయటకొచ్చిన భయంకర సంఘటన
  • 6 years ago
Veteran Bollywood actress Daisy Irani, who is also Farhan Akhtar's aunt, made a shocking revelation saying that she was harmed at the age of six.

ప్రముఖ బాలీవుడ్ సినీయర్ నటి డైసీ ఇరానీ తాజాగా ఓ షాకింగ్ విషయం వెల్లడించారు. తనపై ఆరేళ్ల వయసులోనే అత్యాచారం జరిగిందని, అత్యాచారం జరుపడంతో పాటు బెల్టుతో తీవ్రంగా కొట్టాడని, ఈ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. ఈ విషయాలను ఆమె ఆంగ్ల పత్రికతో పంచుకున్నారు.
హమ్ పంచీ ఏక్ దాల్ కే' షూటింగ్ కోసం మద్రాసు(చెన్న) వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో నాకు గార్డియన్‌గా ఓ వ్యక్తిని నిమయించారు. అతడే ఓ రోజు రాత్రి హోటల్ రూములో నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఈ భయంకర సంఘటన గురించి 60 ఏళ్ల తర్వాత ఆమె బయట పెట్టారు. తనపై ఈ ఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి పేరు డైసీ ఇరానీ తెలిపారు.
ఆ వ్యక్తి ఎప్పుడో చనిపోయాడు. అతడి పేరు నాజర్. ఫేమస్ సింగర్ జోహ్రాభాయి అంబలేవాలికి బంధువు. అతడికి సినిమా ఇండస్ట్రీలో చాలా పరిచయాలు ఉండేవి. నా తల్లి నన్ను స్టార్‌ను చేయడానికి చాలా నరకం అనుభవించింది. బేబీ అనే మరాఠీ మూవీ ద్వారా నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. ‘హమ్ పంచీ ఏక్ దాల్ కె' షూటింగ్ మద్రాసులో జరుగుతుండగా నాకు తోడుగా అంకుల్ నాజర్ వచ్చారు. ఆ సంఘటన తర్వాత అతడి బెదిరింపులతో చాలా భపడిపోయాను. మరుసటిరోజు ఏమీ జరుగనట్లే స్టూడియోకు వచ్చాను. చాలా సంవత్సరాల పాటు ఈ విషయం నా తల్లికి చెప్పడానికి కూడా భయ పడ్డాను అని డైసీ ఇరానీ తెలిపారు.
Recommended