ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ప్రైవేట్ జెట్లో చిరు ఫ్యామిలీ

  • 6 years ago
Megastar Chiranjeevi, Ram Charan, Surekha, Upasna, Sushmita with her kids and husband, Sreeja and Kalyan Kanuganti, and the one n only Allu Arvind travelling through a charted flight to Vizag. They all have attended Rangasthalam pre-release event yesterday.

రామ్ చరణ్ హీరోగా నటించిన 'రంగస్థలం' ప్రీ రిలీజ్ ఫంక్షన్ వైజాగ్‌లో ఆదివారం గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో చిరంజీవితో పాటు సురేఖ, అల్లు అరవింద్, రామ్ చరణ్, ఉపాసన, సుష్మిత, శ్రీజతో పాటు ఆమె భర్త కల్యాణ్, మెగా ఫ్యామిలీ కిడ్స్ హాజరైన సందడి చేశారు.
ఈ వేడుకలో పాల్గొనేందుకు చిరంజీవి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వైజాగ్‌కు ప్రత్యేకంగా ప్రైవేట్ జెట్ బుక్ చేసుకుని వెళ్లారు. రోడ్డు మార్గాన వెళితే చాలా సమయం పట్టే అవకాశం ఉండటం వల్ల ఇలా ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది.
ఆదివారం సాయంత్రం హైదరబాద్ నుండి బయల్దేరిన మెగా ఫ్యామిలీ ‘రంగస్థలం' ప్రీ రిలీజ్ వేడుక ముగిసిన అనంతరం రాత్రి వైజాగ్ లోనే బస చేశారు. సోమవారం ఉదయం అంతా కలిసి మళ్లీ అదే విమానంలో హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం.
మెగా ఫ్యామిలీ ప్రైవేట్ జెట్ ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయింది. మెగా ఫ్యామిలీ తమ రేంజికి తగిన విధంగా ప్రత్యేక విమానంలో వైజాగ్ వెళ్లారని చర్చించుకుంటున్నారు అభిమానులు. ఈ ఫోటోలో చిరంజీవి తన కాలును కొడుకు చరణ్ కాలుపై పెట్టి ఫోటోలకు ఫోజు ఇస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

Recommended