• 7 years ago
Venkatesh eyeing on Malayalam movie. Venkatesh to play another father characte

విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ఆటా నాదే వేటా నాదే. ఈ చిత్రం తేజ దర్సకత్వంలో రూపొందబోతోంది. ప్రస్తుతం వెంకీ విభిన్న కథలతో కూడుకున్న చిత్రాలని చేయడానికి మొగ్గు చూపుతున్నాడు. దృశ్యం, గురు వంటి కథలని ఎంచుకునే పనిలో ఉన్నాడు. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తరువాత ఓ మలయాళీ చిత్రం రీమేక్ లో నటించాడని వెంకటేష్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన గ్రేట్ ఫాదర్ చిత్రం గత ఏడాది విడుదలై విజయం సాధించింది. ఆ చిత్రం వెంకీ కన్ను పడ్డట్లు తెలుస్తోంది.
నేనే రాజు నేనే మంత్రి చిత్రం తరువాత తేజ తెరకెక్కించబోతున్న చిత్రం కావడంతో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో విడుదలైన వెంకీ లుక్ కు మంచి స్పందన వచ్చింది.
తేజ చిత్రం తరువాత వెంకటేష్ ఓ మలయాళీ చిత్ర రీమేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన ది గ్రేట్ ఫాదర్ చిత్రంపై వెంకీ కన్ను పడ్డట్లు తెలుస్తోంది.
గ్రేట్ ఫాదర్ చిత్రంలో మమ్ముట్టితో పాటు స్నేహ, హీరో ఆర్య, అనిఖా నటించారు. తండ్రి పాత్రలో మమ్ముట్టి అదరగొట్టడంతో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.
వెంకటేష్ గతంలో మలయాళీ చిత్రం దృశ్యం రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో కూడా దృశ్యం చిత్రం మంచి విజయం సాధించింది. తండ్రిగా వెంకటేష్ నటన, కథలో వచ్చే ట్విస్టులు ఆసక్తికరంగా నిలిచాయి.
దృశ్యం చిత్రం ఘనవిజయం సాధించడంతో వెంకటేష్ కన్ను ఇప్పుడు ది గ్రేట్ ఫాదర్ చిత్రంపై పడ్డట్లు తెలుస్తోంది. ఈ చిత్ర రీమేక్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Recommended