Traffic policeman kicked Pregnant Woman
  • 6 years ago
Traffic police inspector Kamaraj is arrested after a pregnant lady lost life on the road because of his attitude. This incident happened in Trichy on wednesday night.


తమిళనాడులోని తిరుచ్చి హైవే రహదారి మీద పోలీసుల అతిగా ప్రవర్తించడంతో ఓ గర్బణి బలి అయ్యింది. హెల్మెట్‌ వేసుకోలేదని బైక్‌ మీద వెలుతున్న దంపతులను ట్రాఫిక్ పోలీసులు వెంబడించి నిండు గర్బిణిని పొట్టనపెట్టుకున్నారు. ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్‌ కామరాజ్ కాలు గర్భిణీ పొట్టపై బలంగా తగిలింది. బైక్‌ మీద నుంచి గర్భిణి జారిపడి సంఘటనా స్థలంలో దుర్మరణం చెందగా ఆమె భర్తకు తీవ్ర గాయలైనాయి.

ట్రాఫిక్ పోలీసుల కారణంగా గర్బిణి ఉష మరణించడంతో కోపోద్రిక్తులైన మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ట్రాఫిక్ పోలీసుల చర్యను ఖండిస్తూ స్థానికులు తిరుచ్చి-తంజావూరు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. స్థానికుల దాడిలో పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి.

ఉష కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు దాడి చెయ్యడంతో పలువురు పోలీసులకు గాయాలైనాయి. పరిస్థితి విషమించడంతో అక్కడికి చేరుకున్న తిరుచ్చి డీఎస్పీ ఆందోళనకారులకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. అయితే చర్చలకు వచ్చిన డీఎస్పీ మీద ఆందోళనకారులు చెప్పులు విసిరి దాడి చెయ్యడానికి ప్రయత్నించారు.