Virat Kohli vs Imran Khan Comparison
  • 6 years ago
Drawing similarities between Kohli and Imran, Shastri pointed out that both the skippers had the never give up attitude in them alongside a tremendous amount of energy.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని చూస్తుంటే పాకిస్థాన్ మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ గుర్తుకొస్తున్నాడని హెడ్ కోచ్ రవిశాస్రి అన్నాడు. ఆనంద్ బజార్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో శాస్త్రి మాట్లాడుతూ సఫారీ పర్యటనలో కోహ్లీ దూకుడు గురించి కామెంట్ చేసిన పలువురు మాజీలపై శాస్త్రి విరుచుకుపడ్డారు.

'క్రికెట్ విమర్శకులకు నేను చెప్పేది ఒక్కటే. మీ పని మీరు చూసుకోండి... మీ పని మీరు చేసుకోండి. మా జాబ్ మమ్మల్ని చేసుకోనివ్వండి' అని ఘాటుగా స్పందించాడు.

'నాకు తెలిసి మైదానంలో కోహ్లీ చాలా మామూలుగా ఉంటున్నాడు. అయినా ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించేందుకు అంపైర్లు ఉన్నారు. మ్యాచ్ రెఫరీలు ఉన్నారు అని శాస్త్రి అన్నాడు.

కోహ్లీ చిన్నవయసులోనే ఎన్నో ఘనతలను సాధించాడని గుర్తు చేశాడు. ఇమ్రాన్‌కు, కోహ్లీ చాలా పోలికలు ఉన్నాయని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. 'ఇమ్రాన్ ఎల్లపుడ్డూ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించేవాడు. పరిస్థితులతో సంబంధం లేకుండా.. పోటీతత్వంతో ముందుకు వెళ్లేవాడు. ఆయనలోని శక్తిని నమ్ముకొని జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేశాడు' అని శాస్త్రి పేర్కొన్నాడు.

'ఇవే పోలికలు విరాట్‌ కోహ్లీలోనూ నాకు కనిపించాయి. సఫారీ పర్యటనలో విరాట్ కోహ్లీ చాలా అద్భుతంగా జట్టును ముందుండి నడిపించాడు' అని అన్నాడు. ఒక బ్యాట్స్‌మెన్‌‌గా, జట్టు కెప్టెన్‌గా ఒకేసారి బాధ్యతలు నిర్వర్తించడం చాలా కష్టమని శాస్త్రి చెప్పుకొచ్చాడు.



Recommended