Sridevi Last Rites : Jhanvi Kapoor's Heartfelt Letter To Mom
  • 6 years ago
While the entire country is mourning Sridevi loss, we found a heartfelt letter on social media penned by Jhanvi to her mom Sridevi a few years ago. The letter was shared by Tanya Chaitanya, Femina editor, on her Instagram. The Mom actress was extremely excited about Jhanvi s debut Dhadak, but unfortunately, she won't be by Janhvi's side, for her big moment.

తన బంధువు మోహిత్ మార్వా వివాహ వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.... ఇండియా తిరిగి వచ్చిన వెంటనే ఒక ముఖ్యమైన పనిలో నిమగ్నం కావాలనుకున్నారు. మార్చి 7వ తేదీన జాహ్నవి పుట్టినరోజు ఉండటంతో ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేశారు.
ధడక్' అనే సినిమా ద్వారా జాహ్నవి కపూర్ ఈ ఏడాది బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ పుట్టినరోజు వేడుకను బాలీవుడ్ ప్రముఖులందరినీ ఆహ్వానించి వైభవంగా చేయాలనుకున్నారు. మార్చి 7తో జాహ్నవి 21వ వసంతంలోకి అడుగు పెట్టబోతోంది.
నేడు శ్రీదేవి అంత్యక్రియలు జరుగుతున్నాయి. మరో వారం రోజుల్లో జాహ్నవి కపూర్ పుట్టినరోజు..... ఇలా చాలా కఠినమైన సమయం, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని పలువురు అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
నిర్మాతగా తీవ్ర నష్టాల పాలైన బోనీ కపూర్..... శ్రీదేవి పేరు మీద ఉన్న ఆస్తులు అమ్మి తన అప్పులు కవర్ చేశారు. అటు భర్తను కాదనలేక, ఇటు కూతుళ్లకు ఇవ్వడానికి చివరకు తన వద్ద ఏమీ మిగలదేమో అనే సంఘర్షణలో శ్రీదేవి కొట్టుమిట్టాడింది.
ఇక తల్లి మరణంతో ఆమె కూతుళ్లు జాహ్నవి కపూర్, ఖుషి కపూర్ తీవ్ర మనోవేదనలో కూరుకుపోయారు. ఇకపై తాము అమ్మ లేకుండానే జీవించాలనే విషయాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం తన తల్లిని ఎంత ప్రేమిస్తున్నానో తెలుపుతూ జాహ్నవి కపూర్ ఓ లేఖ రాశారు. ఆ లేఖను ఫెమినా మేగజైన్ ఎడిటర్ తాన్యా చైతన్యా తాజాగా బయట పెట్టారు. ఈ లేఖ చదివిని ప్రతి ఒక్కరూ ఉద్వేగానికి లోనవుతున్నారు.
గతేడాది శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూతుళ్లకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ఖుషి కపూర్ తండ్రి బోనీకి చాలా క్లోజ్ గా ఉంటుందని, జాహ్నవి తనతో ఎక్కువ క్లోజ్‌గా ఉంటుందని తెలిపారు. ఇద్దరూ ఇండిపెండెంటుగా ఉంటారు, నేను లేకుండా అయితే జాహ్నవి అస్సలు ఉండలేదు అని.... వెల్లడించారు.
Recommended