No Trust Motion against Modi government
  • 6 years ago
YSRC chief YS Jagan Mohan Reddy on Sunday announced that his party was ready to move a no-confidence motion against the Modi government and dared Jana Sena president and actor Pawan Kalyan to “convince his TDP to follow Same. meanwhile Rahul Gandhi accepted the proposal of party memebers that moving no trust motion against NDA government.
కేంద్రంపై పోరాటం నేపథ్యంలో ఏపీ అధికార పార్టీ టీడీపీ బాగానే ఇరుకునపడింది. జగన్ రాజీనామాలు అనగానే.. మీకన్నా ముందు రాజీనామాలకు మేం సిద్దమన్న టీడీపీ నేతలు.. 'అవిశ్వాస తీర్మానం' అనేసరికి మాత్రం అంతా గప్‌చుప్ అయిపోయారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనకు కాంగ్రెస్ నుంచి కూడా మద్దతు లభిస్తుండటం గమనార్హం.

కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ కూడా సిద్దమవుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని ప్రత్యేకంగా కలిసినవేళ.. అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనకు ఆయన ఓకె చెప్పారు.

కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, జేడీ శీలం, టీ సుబ్బరామిరెడ్డి తదితరులు రాహుల్ గాంధీని కలిసి, కేంద్రంపై అవిశ్వాసం పెడదామని ప్రతిపాదించారు. అలా చేస్తే.. కేంద్రానికి వ్యతిరేకంగా ఏ పార్టీ కలిసి వస్తుందో ప్రజలకు తెలుస్తుందని చెప్పడంతో, అందుకు రాహుల్ గాంధీ కూడా ఓకె చెప్పారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అవిశ్వాసం పెట్టేందుకు రాహుల్ గాంధీ అంగీకరించినట్టు సమాచారం.
Recommended