Congress MLA Stand on Jayalalithaa Portrait Irks Rahul Gandhi
  • 6 years ago
Rahul Gandhi got challenge from Congress MLA over Jayalalithaa portrait unveiled in TN Assembly. Tamil Nadu Congress Committee chief Thirunavukarasar on Tuesday warned of “strict action” against party MLA Vijayadharani for her stand on unveiling of J Jayalalithaa’s portrait in the Assembly.

తమ పార్టీ ఎమ్మెల్యే విజయధరణి ఏకంగా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే సవాల్‌ చేయడం ఎంత మాత్రం సహించబోమని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ అన్నారు. ఎమ్మెల్యే విజయధరణిపై కఠిన చర్య తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి లేఖ రాశానని ఆయన మీడియాకు చెప్పారు.
ఫిబ్రవరి 12వ తేదీన తమిళనాడు శాసన సభ హాలులో ఆ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిలువెత్తు చిత్రపటాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మంత్రుల సమక్షంలో అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ ఆవిష్కరించారు.
జయలలిత నిలువెత్తు చిత్రపటం ఆవిష్కరణ కార్యక్రమాన్ని తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం అయిన డీఎంకే, కాంగ్రెస్ పార్టీతో సహ ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ బహిష్కరించారు.
అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారణ అయిన జయలలిత చిత్రపటం అసెంబీలో పెట్టడం ఏమిటని తిరునావుక్కరసర్‌ మండిపడ్డారు. జయలలిత చిత్రపటం తరువాత స్మగ్లర్‌ వీరప్పన్, సీరియల్‌ కిల్లర్‌ ఆటో శంకర్‌ ఫొటోలు అసెంబ్లీలో ఆవిష్కరిస్తారని తమిళనాడు కాంగ్రెస్‌ మాజీ అద్యక్షుడు ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన కార్యక్రమానికి అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయధరణి హాజరైనారు. అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్ కు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విజయధరణి జయలలిత చిత్రపటం అవిష్కరించడాన్ని తాను సమర్థిస్తున్నానని బహిరంగంగా ప్రకటించి స్పీకర్ ధనపాల్ కు పుష్పగుచ్చం ఇచ్చి అభినంధించారు. విజయధరణి ప్రవర్తనపై తిరునావుక్కరసర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు.
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జయలలిత మరణించారని, తరువాత రాహుల్ గాంధీ, తిరునావుక్కరసర్ ఆమె అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకూ ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విజయధరణి గుర్తు చేశారు. అక్రమాస్తుల కేసులో నిందితురాలు అయిన జయలలిత అంత్యక్రియలను రాహుల్ గాంధీ, తిరునావుక్కరసర్ ఎందుకు బహిష్కరించలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విజయధరణి అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు.
Recommended