టాలీవుడ్ టాప్ సెలబ్రిటీల ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?

  • 6 years ago
Do you know our Tollywood celebrities crushes, It happens with everyone and the stars. But, don't you want to know on whom your favorite celebs were crushing on? Check out the slides to get into the details.

ఫస్ట్ క్రష్.... ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో కలిగే భావన. ఒక అమ్మాయి లేదా అబ్బాయిని చూడగానే మనసుకు హాయిగా గుచ్చుకునే ప్రేమ భావన. సినిమాల ప్రభావం బాగా ఉండే ఈ జనరేషన్లో చాలా మంది సినిమా హీరోలు, హీరోయిన్ల మీదనే ఇలాంటి ఫస్ట్ క్రష్ ఫీలవుతుంటారు. తెలిసీ తెలియని వయసులో కొందరు తమ క్లాస్ మేట్స్ మీద, స్కూలు టీచర్ల మీద ఫస్ట్ క్రష్ ఫీలవుతారు. సినిమా స్టార్లు కూడా ఇందుకు అతీతులేమీ కాదు. టాలీవుడ్ సెలబ్రిటీలు వివిధ సందర్భాల్లో తమ ఫస్ట్ క్రష్ గురించి వెల్లడించారు. అందుకు సంబంధించిన విశేషాలు ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుందాం.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నమ్రత కంటే ముందు మహేష్ బాబు జీవితంలో తొలి సారి ఫస్ట్ క్రష్ ఫీలైంది అమెరికన్ నటి డెమి రోజ్ మీదేనట
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-స్నేహా రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే స్నేహారెడ్డి కంటే ముందు బన్నీ మనసు కొల్లగొట్టింది అందాల సుందరి ఐశ్వర్యరాయ్.
ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మీ ఫస్ట్ క్రష్ ఎవరిపై అనే ప్రశ్నకు హీరోయిన్ తమన్నా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తన ఫ్రెండ్ బ్రదర్ మీద తనకు ఫస్ట్ క్రష్ కలిగిందని, తరచూ తన ఫ్రెండును కలవడానికి వెళ్లే సమయంలో తనకు ఈ ఫీలింగ్ కలిగిందని, అయితే అతడు మాత్రం తనను పట్టించుకునే వాడు కాదని తమన్నా తెలిపారు.
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఎంతో మంది అమ్మాయిలకు కలల రాకుమారుడు. నటి మంచు లక్ష్మికి కూడా నాగార్జున అంటే పిచ్చి. తనకు ఫస్ట్ క్రష్ కలిగింది నాగార్జున మీదే అంటూ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేసింది మంచు లచ్చక్క.
టాలీవుడ్ బాహుబలి ప్రభాస్‌కు స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే ఫస్ట్ క్రష్ కలిగిందట. తాను చెన్నై డాన్ బాస్కో స్కూల్లో చదువుతున్న రోజుల్లో క్లాస్ టీచర్ మీద ఫస్ట్ క్రష్ కలగిందని తెలిపారు

Recommended