Anchor Syamala Shares Her Personal Life Things

  • 6 years ago
Anchor Syamala made her mark in Telugu television with her own talent. She has hosted many TV shows and worked with many leading actors in supporting roles. Shyamala spoke to a youtube media channel and share her personal life things.

తెలుగు ప్రేక్షకులందరికీ యాంకర్ శ్యామల సుపరిచితులు. అటు టెలివిజన్ రంగంలోనూ, సినీరంగంలోనూ రాణిస్తూ ఆమె ఆకట్టుకొంటున్నది. ఇటీవల ఓ ప్రైవేట్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో శ్యామల వెల్లడించిన విషయాలు ఇవే..
సోషల్ మీడియాకు సంబంధించి పాజిటివ్, నెగిటివ్ అంశాలున్నాయి. ప్రజలు, ప్రేక్షకులతో కనెక్ట్ కావడానికి చాలా ఉపయోగంగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. ఓసారి బ్లూ ఫిలిం బాడీకి నా ఫేస్ అతికించి పోస్ట్ చేశారు. అది నా భర్త నా దృష్టికి తీసుకురావడం ఇంకా బాధ కలిగింది.
నా భర్త కూడా సినీ, టెలివిజన్ పరిశ్రమకు సంబంధించిన వారు కావడంతో నన్ను అర్థం చేసుకొన్నాడు. బయటి వ్యక్తి అయితే నా పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోండి. అలాగే చాలా చెండాలమైన ఫొటో పెట్టి ఆఫర్లు తగ్గాయి అందుకే ఇలాంటి వేషాలు అని హెడ్‌లైన్ పెట్టారు. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి.సోష్ల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్లను చూస్తే బాధ కలుగుతుంది. తొలుత బాధ ఉన్నా.. ఆ తర్వాత వదిలేయడం అలవాటైపోయింది. నా ప్రొఫెషన్ విషయంలో నా భర్త ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. నాకు చాలా సహకారం అందిస్తాడు.
ప్రదీప్, సుమ, లాస్య, రవి లాంటి యాంకర్లందరూ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ప్రదీప్‌తో తొలిసారి అవార్డు ఫంక్షన్‌లో హోస్ట్‌గా వ్యవహరించాను. అప్పటికి నాకు అవార్డు ఫంక్షన్లను నిర్వహించే అనుభవం లేదు. ప్రదీప్ ఆ విషయంలో చాలా హెల్ప్ చేశాడు. ప్రదీప్ చాలా క్లాస్‌గా వ్యవహరిస్తాడు.

Recommended