సర్వేలు: జగన్‌కు, చంద్రబాబుకు షాక్

  • 6 years ago
According to reports - Two surveys commissioned by Telugu Desam chief and Chief Minister N. Chandrababu Naidu point to the party bagging 140 to 145 seats in the Assembly elections in AP.

ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి షాక్ తప్పదా అనే అనే ప్రశ్న ఉదయిస్తోంది. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో కన్నా ఎక్కువ సీట్లతో ఘన విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సర్వేలు చేయించారని వార్తలు వచ్చాయి. 2014లో కన్నా ఎక్కువ సీట్లను టిడిపి వచ్చే ఎన్నికల్లో కైవసం చేసుకుంటుందని సర్వేలు తెలియజేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ 140 నుంచి 145 సీట్లు గెలుచుకుంటుందని సర్వేలు వెల్లడించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో టీడిపి 103 సీట్లు గెలుచుకుంది. ఎపి శాసనసభలో మొత్తం 175 సీట్లు ఉన్నాయి.
రాయలసీమలో టీడిపి పరిస్థితి మెరుగైనట్లు సర్వేలో తేలిందని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉన్న ప్రకాశం,, నెల్లూరు జిల్లాలో మాత్రం టిడిపి బలహీనంగానే ఉంది. రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే టిడిపికి 23 సీట్లు వచ్చాయి. కడప జిల్లాలోని పది సీట్లకు గాను టిడిపికి ఒక్కటే వచ్చింది. కర్నూలు జిల్లాలో 14 సీట్లు ఉంటే టిడిపికి నాలుగు సీట్లు వచ్చాయి.
కాపు ఉద్యమం నడిచినప్పటికీ గోదావరి జిల్లాలో టిడిపి బలం చెక్కు చెదరలేదని, తన సీట్లను వచ్చే ఎన్నికల్లో నిలబెట్టుకుందని అంటున్నారు. ప్రకాశం జిల్లాలో 12 సీట్లకు గాను టిడిపి గత ెన్న్ికల్లో ఐదు సీట్లను గెలుచుకుంది. నెల్లూరు జిల్లాలో పది సీట్లు ఉంటే మూడు మాత్రమే గెలుచుకోగలిగింది.

Recommended