మోహన్ లాల్ సిట్టింగ్ అన్నారు.. కానీ తారక్, విడాకులు తీసుకున్నాకే పెళ్లి ?

  • 6 years ago
Actor Brahmaji gave an interview to comedian Ali in an popular tv channel. Brajmaji said about his film journey and his personal.

బ్రహ్మాజీ.. పలానా పాత్ర అని కాకుండా.. దాదాపుగా అన్ని పాత్రల్లోనూ ఇట్టే ఇమిడిపోయే నటుడు. గతేడాది వచ్చిన ఓ సినిమాలో హీరో తండ్రిగానూ కనిపించాడు. యాభై పదుల వయసులోనూ ఆయనలో అసలా ఛాయలే కనిపించకపోవడం విశేషం. ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీపడగల ఫిట్‌నెస్ ఆయనది. ఇటీవల ఓ ప్రముఖ టీవి చానెల్‌లో కమెడియన్ అలీతో ఆయన సాగించిన చిట్‌చాట్‌లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు
నేను కృష్ణగారికి వీరాభిమానిని. అయితే సినిమాల్లోకి రావడానికి ఆయనే స్ఫూర్తి అని కాదు. మా నాన్న తహసీల్దార్‌గా పనిచేసే రోజుల్లో 'శంకరాభరణం' విడుదలైంది. సోమయాజులు గారికి సన్మానం చేద్దామని ఏలూరు తీసుకొచ్చారు. మా నాన్న ఆఫీసర్‌ కావడంతో స్టేజి‌పైన నిలబడి చూసే అవకాశం చిక్కింది. అందరూ అభిమానంతో ఆయన కాళ్లపై పడుతున్నారు. అది చూశాక నటుడైతే ఇంత పాపులరాటీ వస్తుందా! అనుకున్నాను.
చెన్నైలో నేనూ, కృష్ణవంశీ రూమ్ మేట్స్. పరిచయమైన కొత్తలో మాత్రం వేర్వేరుగానే ఉండేవాళ్లం. పాండిబజార్‌లో సాయంత్రం పూట కలుసుకునేవాళ్లం. 'శివ' సినిమాకు కృష్ణవంశీ అసిస్టెంట్ దర్శకుడిగా చేరాడు. అదే సినిమాలో నేను కూడా నటించడంతో మా ఇద్దరి మధ్య పరిచయం బలపడింది. ఆ తర్వాత రూమ్ మేట్స్ అయ్యాం.

Recommended