తెలంగాణలో పవన్ టూర్.. ఎదురొచ్చి హారతిచ్చిన భార్య..!

  • 6 years ago
Jana Sena founder and Tollywood actor Pawan Kalyan said he would visit Hanuman Temple in Kondagattu near Karimnagar tomorrow and announce his political programme.

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొండగట్టుకు బయలుదేరుతున్నారు. మొదట ఆయన, సోమవారం ఉదయం హైదరాబాదులోని తన ఇంటి నుంచి జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కొండగట్టుకు బయలుదేరారు. బయలుదేరేముందు భార్య లెజినోవా ఎదురొచ్చి హారతి ఇచ్చారు. సికింద్రాబాద్, ప్రజ్ఞాపూర్, సిద్దిపేట మీదుగా కొండగట్టు చేరుకుంటారు. 50 కాన్వాయ్‌లతో బయలుదేరారు. ఆయన వెంట అభిమానులు పెద్దఎత్తున తరలి వచ్చారు.
కొండగట్టులో ఆంజనేయస్వామి దర్శనం అనంతరం కరీంనగర్ చేరుకుంటారు. అక్కడ జనసేన ముఖ్య నాయకులతో భేటీ అవుతారు.
ఇప్పటికే, కాంగ్రెస్ పార్టీ నేత, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ జనసేనానికి హెచ్చరికలు జారీ చేశారు. పవన్ కొండగట్టు పర్యటన అడ్డుకుంటామని చెప్పారు. కొండగట్టుకు పవన్ రావడం తమకు అభ్యంతరం లేదని, కానీ గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.
కాగా, పవన్ రెండు రోజుల పాటు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరి 11.30 గంటలకు అల్గునూర్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ ద్విచక్ర వాహనాల, కార్లతో స్వాగతం పలికి ర్యాలీగా 12:30 గంటల వరకు రేకుర్తికి వెళ్తారు. అక్కడి నుంచి కేవలం కార్ల కాన్వాయ్‌ మాత్రం పవన్‌‌తో మధ్యాహ్నం కొండగట్టుకు చేరుకుంటుంది.

Recommended