రూ. 40 లక్షల విరాళం ఇచ్చిన జక్కన్న.. ఇంతకీ దేనికో తెలుసా?
  • 6 years ago
It is known that Hudud cyclone wreaked havoc in Vizag in 2014. ZP High School building in Kasimkota was collapsed during the cyclone which has a 154-year-old history. Rajamouli reportedly donated Rs.40 lakh for the reconstruction of the school.

దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని దేశ సరిహద్దులు సైతం దాటించి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రతిభాశాలి. తాను కేవలం గొప్ప ప్రతిభాశాలి మాత్రమే కాదు, మంచి మనసున్న వ్యక్తిని అని నిరూపించుకుంటూనే ఉన్నారు. విశాఖపట్నం జిల్లా కశింకోటలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన నిర్మాణం కోసం రాజమౌళి భారీ విరాళం ఇచ్చారు. 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భవన నిర్మాణానికి సాయం చేశారు.2014 హుద్‌హుద్‌ తుఫాన్‌ వల్ల విశాఖ జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలల భవనాలు కూలిపోయాయి. అందులో 154 ఏళ్ల చరిత్ర కలిగిన కశింకోటలోని దురిశేటి పెదనర్సింహమూర్తి(డీపీఎన్‌) జెడ్పీ హైస్కూల్‌ ఉంది. ఈ పాఠశాల భవన నిర్మాణానికి తనవంతుగా సాయం అందించాలన్న భావనతో రూ.40 లక్షలు అందజేశారు.2015లో ఈ భవన నిర్మాణం మొదలు పెట్టగా ప్రస్తుతం నిర్మాణం పూర్తయింది. దీనికి తన తల్లి జననీ రాజనందిని అని పేరు పెట్టారు. ఈ భవనం శిలాఫలకంపై ఎస్‌ఎస్‌ రాజమౌళి, వైఎన్‌ శోభనాద్రి, టి. ప్రశాంతి, ఎంఎం కీరవాణి పేర్లు ఉన్నాయి.రాజమౌళి సినిమాల విషయానికొస్తే బాహుబలి-2 తర్వాత ఆయన రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో మల్టీ స్టారర్ మూవీ చేయడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Recommended