Ram Charan, NTR Holyday trip : Rajamouli master plan
  • 6 years ago
Ram Charan, NTR went on Holyday trip. This holyday planned by Rajamouli for friendship bond between two young heroes. As part of the holyday trip, These two are going to participate in photoshoot. Samantha Akkineni and Rashi Khanna approached for this multi starrer movie.
రంగస్థలం సినిమా షూటింగ్ బీజీ నుంచి రాంచరణ్ ఇప్పుడే తేరుకొన్నాడు. ఇక ఎన్టీఆర్ త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రంతో బిజీగా మారబోతున్నాడు. ఈ మధ్య కాస్త సమయం చిక్కడంతో రాజమౌళి సినిమా కోసం అమెరికాకు వెళ్లిపోయారు. అయితే ఫోటోషూట్ కోసం యూఎస్ వెళ్లారనే వార్తలు ఓ పక్కన పెడితే.. వారి హాలీడే ట్రిప్ వెనుక మరో వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. అదేమిటంటే..

బాహుబలి చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లోపు ఇద్దరు యువ స్టార్ల మధ్య అవగాహన కల్పించడానికి రాజమౌళి ఓ హాలీడే ట్రిప్‌ను ఏర్పాటు చేసినట్టు ఆ వార్త సారాంశం.

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తున్నారంటే.. తమ కోసం కాకపోయినా ఫ్యాన్స్ కోసం కొన్ని లెక్కలు వేసుకొంటారు. మల్టీస్టారర్ సినిమాలో హీరోలకు కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులు రాకుండా ఎన్టీఆర్, చెర్రీ మధ్య స్నేహబంధాన్ని పెంచేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట.
Recommended