Pawan & KCR's meeting : కేసీఆర్ - పవన్ భేటీ : 'తాట తీస్తా', 'ఆడి పేరేందిరా బై' !

  • 6 years ago
Tollywood director Ram Gopal Varma sensational comments on Pawan kalyan and Telangana CM Kcr's meeting on Tuesday. KCR and Pawan Kalyan were made allegations each and other few days back, varma reminded that comments in his post.


రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని తెలుగునాట తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరు ఎవరినైనా కలువొచ్చు. ఇందులో వింతేమీ లేదు. 2014 అసెంబ్లీ, లోక్ సభ జమిలీ ఎన్నికల సందర్భంగా పరస్పర విమర్శలతో 'రాజకీయ వేడి'ని పెంచిన వారు ప్రస్తుతం కలువడమే ప్రత్యేకత. అంతే కాదు నాడు 'మాటల తూటాలు' పేల్చినవారు ఈనాడు ప్రశంసలు గురిపించడం మారిన పరిస్థితులను తెలియజేస్తున్నది.రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలూ అవే చెప్తున్నాయి. ప్రత్యేకించి తెలంగాణ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ప్రస్తుత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన కుటుంబ సభ్యులపై ప్రత్యర్థులు ఒంటికాలిపై లేచే వారు. అటువంటి వారిలో పవర్ స్టార్, మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ ఒకరు.

నూతన సంవత్సరం సందర్భంగా తొలిసారి ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో పవన్ కల్యాణ్ దాదాపు గంటసేపు సమావేశం కావడం సహజంగానే రాజకీయ సర్కిళ్లలో చర్చనీయాంశమే. భేటీ తర్వాత ఇదొక గుడ్ మీట్ అని పవర్ స్టారే చెప్పకనే చెప్పారు. దీంతో భవిష్యత్‌లో రాజకీయ సమీకరణాలు మారతాయా? అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం సాయంత్రం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిసేందుకు వెళ్లిన సీఎం కేసీఆర్ కోసం పవన్ కల్యాణ్ వేచి ఉండటం మరింత ఆసక్తికర పరిణామం. ఈ భేటీ వెనుక అసలు కారణం ఏమై ఉంటుంది? పైకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అని తెలిపినప్పటికీ.. ఈ భేటీ వెనుక ప్రధాన కారణం ఏదో రాజకీయ మతలబు ఉండి ఉంటుందేనని చెప్తున్నారు.

Recommended