జగన్‌కు చావో రేవో: ఎటూ తేల్చని పవన్ కల్యాణ్

  • 6 years ago
Jana Sena chief Pawan Kalyan has so far not decided on who he should sail with in the coming polls or simply go alone.


తెలుగుదేశం పార్టీతో బిజెపిలోని ఓ వర్గం కయ్యానికి కాలు దువుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమీకరణాలు మారుతాయా అనే అనుమానాలు తలెత్తుత్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఒంటి కాలి మీద లేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుపై తమ పార్టీని బద్నాం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనేది ఆయన ముఖ్యమైన ఆరోపణ. అయితే, పార్లమెంటు సభ్యుడు హరిబాబు నేతృత్వంలోని బిజెపిలోని మరో వర్గం మాత్రం చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తోంది.

బిజెపిలోని ఓ వర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోము వీర్రాజు, తదితరులు చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నట్లు భావిస్తున్నారు. జగన్‌కు రాష్ట్రంలో అధికారం ముఖ్యం కాబట్టి పొత్తు పెట్టుకుంటే తమకు ఎక్కువ లోకసభ స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని బిజెపిలోని ఓ వర్గం భావిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి రావడం తమకు ముఖ్యం కాబట్టి జగన్‌తో వెళ్లడమే మంచిదనే భావనతో ఆ వర్గం ఉన్నట్లు సమాచారం.

ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవాలా, ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలా అనే విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంకా ఓ స్పష్టతకు రాలేదు. పవన్ కల్యాణ్ తమతోనే కలిసి నడుస్తారని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు పవన్ కల్యాణ్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నారు. కేంద్రంపై ఎక్కువ విమర్శలు చేస్తూ తమపై తక్కువ విమర్శలు చేయడాన్ని బట్టి ఆ నిర్ధారణకు వస్తున్నట్లు అనుకోవచ్చు.ప్రస్తుత పరిస్థితిలో చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. బిజెపి నేతలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన సంయమనం పాటిస్తున్నారు. పైగా, బిజెపి నేతల విమర్శలపై ఎదురు దాడికి దిగవద్దని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి ఆయన ప్రస్తుతం సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నా అనివార్యమైతే ఏం చేయాలనే వ్యూహరచన కూడా చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు.

Recommended