'జై సింహా' కథ లీక్ ! రజినీ సినిమా కు కాపీ నా ?

  • 6 years ago
According to the latest buzz in film industry, Jai Simha is inspired from Kollywood superstar Rajinikanth’s Muthu, directed by KS Ravikumar, which was released in 1995.


కొత్త సినిమా మొదలైందంటే చాలు.. తెరపై బొమ్మ పడేదాకా దాని చుట్టూ కావాల్సినన్ని గాసిప్స్ షికారు చేస్తుంటాయి.తాజాగా నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న 102వ చిత్రంపై కూడా ఓ కొత్త గాసిప్ పుట్టుకొచ్చింది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో.. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన ఓ సినిమా ఛాయలు కనిపిస్తాయన్న ఊహాగానాలు ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 1995లొ వచ్చిన 'ముత్తు' సినిమా కథనే 'జై సింహా' సినిమాకు స్ఫూర్తిగా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ముత్తు సినిమాలో లాగే.. జై సింహాలోను బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తారట. కాగా, ముత్తు సినిమా దర్శకుడు కూడా కె.ఎస్.రవికుమారే కావడం గమనార్హం.
జైసింహాలో ముత్తు సినిమా ఛాయలు కనిపిస్తాయన్న ఊహాగానాలతో నందమూరి అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ సినిమాపై గతంలోనూ ఇలాంటి ఊహాగానాలు చాలానే వచ్చాయి. బాలయ్య భగ్న ప్రేమికుడి పాత్రలో కనిపించబోతున్నారని, తాను ప్రేమించిన నయనతారకు కిక్ శ్యామ్ తో పెళ్లవుతుందని.. ఇలా జై సింహా కథ గురించి చాలానే ఊహాగానాలు వినిపించాయి.
బాలయ్య జైసింహా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. జైసింహా ట్రైలర్‌లో యాక్షన్ సీన్స్ తో కుమ్మేసినప్పటికీ.. సినిమాలో మాత్రం ఫస్టాఫ్.. క్లైమాక్స్‌కు మాత్రమే వీటిని పరిమితం చేశారట.

Recommended