కేటీఆర్, రేవంత్ కౌంటర్లు !

  • 6 years ago
Telangana IT Miniser KTR takes on Congress over twitter, Congress leader and Kodangal MLA Revanth Reddy counter to Minister.

మంత్రి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మధ్య వివాదం ముదురుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. తాజాగా సోమవారం మంత్రి కేటీఆర్ స్పందించగా, రేవంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు.టిడిపి నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతాననే భయంతో రాజీనామా చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నారని, అందరి దృష్టి మళ్లించేందుకు మంత్రులు, నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

తాను రాజీనామాకు సిద్ధమని, రేవంత్ కూడా సిద్ధామా అని, అప్పుడు ఎవరి సత్తా ఏమో తెలుస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సవాల్ చేశారు. రేవంత్ అందరిని అవమానించేలా మాట్లాడుతుంటే కాంగ్రెస్ పెద్దలు చోద్యం చూస్తున్నారా అని నిలదీశారు. ఆ పార్టీకి నైతిక విలువలు ఉంటే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Recommended