హలో మూవీ రివ్యూ, ప్రేక్షకుల స్పందన !

  • 6 years ago
Akhils film Hello released on December 22, to cash in on the long Christmas weekend. This movie got good response to teaser and First look. Actor, Producer Nagarjuna relaunching Akhil with prestigiously.

ప్రఖ్యాత అన్నపూర్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మాతగా అఖిల్ అక్కినేని, కల్యాణి ప్రియదర్శిని జంటగా నటించిన హలో చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనం ఫేం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రివ్యూ ప్రదర్శనలను అమెరికాలో గురువారం రోజే ఏర్పాటు చేశారు. ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో రివ్యూలను, అభిప్రాయాలు మీకోసం..
సునగ అనే నెటిజెన్ మాటల్లో !
ప్రతీ ఒక్కరికి హలో. ఇప్పుడే హలో చూశాను. సూపర్బ్‌గా ఉంది. ఆ చిత్రం గురించి మాట్లాడలేకుండా ఉండలేకపోతున్నాను. ముఖ్యంగా అఖిల్ నటన బాగుంది. నాగార్జున, విక్రమ్, అనూప్, చిత్ర యూనిట్‌కు హలో. నా ప్రేమాభినందనలు.
ఇక పవన్ అనే నెటిజెన్
ఇప్పుడే హలో చూశాను. సూపర్బ్‌గా ఉంది. హలో బ్లాక్‌బస్టర్. అఖిల్ హార్డ్‌వర్క్ బాగున్నది. నాగార్జున, అనూప్ రూబెన్స్, చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్.
కర్నూల్ ప్రతాప్ రెడ్డి
ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది. సెకండాఫ్ మైండ్ బ్లోయింగ్. ఈ చిత్రం చూశాక విమర్శకులందరూ అక్కినేని ఫ్యాన్స్‌‌గా మారుతారు.

Recommended