నాన్న అపుడు హ్యాపీగా లేరు మా అత్తగారు అలా... శ్రీజ బెటర్..!

  • 6 years ago
Chiranjeevi Daughter Sushmita said, "Daddy feels sad to sit at home without work and he won't be happy without going to shooting too. That's why we will also feel happy if he is on the sets of a film rather being at home".

మెగా స్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కూడా సినిమా రంగలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే యాక్టింగ్ సైడ్ కాకుండా తెర వెనక కాస్టూమ్ డిజైనర్ గా ఆమె తన టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సుష్మిత తన సోదరుడు రామ్ చరణ్ మూవీ 'రంగస్థలం', తండ్రి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రానికి పని చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుష్మిత ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత నాన్న ఒకానొక సమయంలో ఇంట్లో ఖాళీగా ఉండాల్సి వచ్చింది. చాలా మంది మెగాస్టార్ వయసు 60 ఏళ్లు దాటింది కదా, ఇంట్లో కూర్చుని హ్యాపీగా రెస్టు తీసుకుంటున్నారు అని భావించేవారు. కానీ అలా ఇంట్లో విగ్రహంలా కూర్చోవడం నాన్నకు ఇష్టం ఉండేది కాదు, షూటింగులకు వెళ్లకుండా ఉండటం నాన్నకు సంతోషాన్ని ఇచ్చేది కాదు... అని సుష్మిత తెలిపారు.
మా అత్తగారికి నేను నటిని కావాలని ఉండేది. ఇప్పటికీ ఆమె నటిగా ట్రై చేయ్, నిన్ను వెండితెర మీద చూడాలని ఉంది అని చెబుతుంటారు. ఏది ఏమైనా ఇపుడు నేను నాన్న, చరణ్ తో కలిసి సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తుండటంపై వారు సంతోషంగా ఉన్నారు...

Recommended