BJP Wins Rajkot West Assembly Seat విజయ్‌రూపానికి చుక్కలు చూపిన రాజ్‌గురు !

  • 6 years ago
Indranil Rajguru, the 51-year-old Congress candidate and currently an MLA from Gujarat’s Rajkot East constituency,face off against BJP candidate chief minister Vijay Rupani from the Rajkot West constituency.

గుజరాత్ ప్రస్తుత సీఎం విజయ్ రూపానీపై కాంగ్రెస్ పార్టీ ఇంద్రనీల్ రాజ్‌గురును బరిలోకి దింపింది. అయితే రాజ్‌గురు పోటీలో ఉన్న అభ్యర్థుల్లో అందరికంటే ధనవంతుడని ఎన్నికల సంఘానికి సమర్పించిన లెక్కలను బట్టి తెలుస్తోంది.అయితే గుజరాత్ సీఎం విజయ్ రూపానీపై ఇంద్రనీల్ రాజ్ గురు ఉద్దేశ్యపూర్వకంగా పోటీ చేస్తున్నారు. విజయ్ రూపానీని ఓడించాలనే లక్ష్యంగానే రాజ్‌కోట్ వెస్ట్ నుండి రాజ్ గురు బరిలోకి దిగారు. ప్రస్తుతం రాజ్‌కోట్ ఈస్ట్ నుండి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు.అయితే హోరాహోరీగా జరిగిన ఈ పోరులో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఇంద్రనీల్ రాజ్ గురుపై 4700 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే కొన్ని రౌండ్లలో విజయ్ రూపానీ వెనుకంజలో ఉన్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ఓడించాలనే లక్ష్యంతో విజయ్ రూపానీపై ఇంద్రనీల్ రాజ్ గురు రాజ్ కోట్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు. రాజ్ కోట్ ప్రాంతం నుండి విజయం సాధించి ముఖ్యమంత్రులుగా ఎన్నికైన వారెవరు కూడ ఈ ప్రాంత ప్రజల సమస్యలను పట్టించుకోలేదని రాజగ్ గురు ఆరోపణలు గుప్పించారు. విజయ్ రూపానీని ఓడించడం ద్వారా తన సత్తాను నిరూపించుకోవాలని ఇంద్రనీల్ రాజ్‌గురు భావిస్తున్నారు. ఈ మేరకు నియోజకవర్గాన్ని కూడ ఇంద్రీనీల్ మార్చుకొన్నారు.

Recommended