Rahul Gandhi Coronation : ఇందిరా, రాజీవ్‌ల బలిదానాలు వృథా కానివ్వొద్దు !

  • 6 years ago
Sonia Gandhi at Rahul Gandhi Coronation: I wanted my son, husband out of politics, but they had responsibilities

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ శనివారం బాధ్యతలు చేపట్టారు. శనివారం ఉదయం 11గంటల ప్రాంతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఇతర సీనియర్ నేతలు వేదికపైకి చేరుకున్నారు. నేతల సమక్షంలో రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. 20ఏళ్ల క్రితం తనను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని చేశారని అన్నారు. అందరి ఒత్తిడి వల్లే తాను ఆ బాధ్యతలు తీసుకున్నానని చెప్పారు. అయితే, అప్పుడు తాను పార్టీ బాధ్యతలు నిర్వహించగలనా? అనే అనుమానం కలిగిందని చెప్పారు. ఇందిరా, రాజీవ్ స్ఫూర్తితో మీ అందరి సహకారంతో తాము రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చామని సోనియా చెప్పారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. సోనియా గాంధీ శక్తివంతమైన నాయకురాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాహుల్ గాంధీ కృషి చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశం అభివృద్ధి దిశగా ప్రయాణించిందని అన్నారు. సోనియా నాయకత్వం కాంగ్రెస్ అనేక చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని అన్నారు. కాగా, రాహుల్ గాంధీ బాధ్యతల స్వీకరణ వేదిక వద్దకు రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్ పెద్దలు, నేతలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్దకు భారీగా నేతలు, కార్యకర్తలు చేరుకోవడంతో సందడి నెలకొంది.

Recommended