పవన్ కళ్యాణ్ సిగ్గుపడలేదు: వర్మ | Oneindia Telugu

  • 6 years ago
Just saw the latest speech of Pawan Kalyan..extremley thrilled to observe his tremendous insights into various issues ..He has a incisive clarity on both past and future and showed an extraordinary honesty in clearing the air about multiple rumors surrounding him' says RGV in Facebook post.

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ప్రముఖ వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ మరోసారి స్పందించారు. ఈసారి మరింత ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఇటీవల పవన్ ఏపీలో నాలుగు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌పై దాదాపు నిత్యం స్పందించే వర్మ.. ఈ పర్యటనపై ఏమీ మాట్లాడకపోవడంపై చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ తాజాగా శుక్రవారం ఆయన జనసేనానిపై ఓ పోస్ట్ పెట్టారు. తన ఫేస్‌బుక్ పేజీలో దానిని పోస్ట్ చేశారు.
పవన్ కళ్యాణ్‌కు నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అంటూ పోస్ట్ ప్రారంభించారు వర్మ. పవన్ కళ్యాణ్ తాజా ప్రసంగం చూశానని, దానిని చూసి తాను ఎంతో థ్రిల్ అయ్యానని పేర్కొన్నారు. వివిధ అంశాలపై ఆయనకు ఉన్న పరిజ్ఞానాన్ని చూసి తాను థ్రిల్ అయ్యానని చెప్పారు.

Recommended