నో కండోమ్‌ 'యాడ్స్‌' : ఇక సన్నీ లియోన్ పాపం !

  • 7 years ago
The government on Monday strictly asked TV channels not to air advertisements selling and promoting condoms because these are “indecent especially for children” and can create “unhealthy practices” among them.

కండోమ్‌ ప్రకటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా అవే, హోర్డింగ్స్‌ పై అవే. ఇక సన్నీ లియోన్ కండోమ్‌ ప్రకటన చేసాక దాన్ని ప్రసారం చెయ్యటం ఇంకా ఎక్కువైందనే చెప్పాలి. అయితే ఇంట్లో కూర్చుని ఫ్యామిలీతో కలిసి టీవీ చూస్తున్నపుడు మాత్రం కండోమ్‌ ప్రకటనలు రావటం ఇబ్బందిగానే ఉంటుందనేది తెలిసిన విషయమే. మరి పెద్దవాళ్ళే అలా ఇబ్బంది పడుతున్నారంటే ఇక చిన్నపిల్లలను అవి ఎంత ప్రభావితం చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే దీనికి చరమ గీతం పాడేందుకు కేంద్రం ప్రభుత‍్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ముఖ‍్యంగా చిన్నపిల్లలను ఈ ప్రభావం నుంచి రక్షించేలా కొన్ని ఆంక్షలు విధించింది. చిన్న పిల్లలపై ప్రభావం చూపే ఆ యాడ్స్‌ను ప్రసారం చేయరాదు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే మొత్తానికి వాటిని బ్యాన్ చెయ్యడం కూడా కుదరదనో, మరి వాటివల్ల అవగాహన కలుగుతుందన్న ఉద్దేశ్యం తోనో ప్రసార సమయాలను మార్చింది. ఉదయం పూట
కండోమ్‌ ప్రకటనలు వెయ్యడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. కండోమ్‌ ప్రకటనలు, ప్రసార సమయాలపై ఇటీవల ఇండియన్‌ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆస్కి), మంత్రిత్వ శాఖకు అందించిన సూచనల మేరకు ఈ దేశాలు జారీ అయ్యాయి.