ఇంట్లో క్లాస్ పీకారు ! చిరు డాన్స్ అంటే పిచ్చి..!

  • 7 years ago
Akhil latest movie 'Hello' releasing on Dec 22. In his interview to the Leading Daily, he said in his personal life details.

మొదటి సినిమాతో సక్సెస్ అందుకోలేని అక్కినేని యువహీరో అఖిల్... ఆ పరాజయం నుండి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాడు. త్వరలో అఖిల్ 'హలో' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అమ్మా నాన్న కలిసి నటించిన ట్రెండ్ సెట్టర్ మూవీ ‘శివ' తొలిసారి చూసినపుడు తనకు నచ్చలేదని, అపుడు చిన్నపిల్లాన్ని కావడం వల్ల అర్థమే కాలేదని, ఆ సినిమాను ఇప్పటికీ 22 సార్లు చూశాను. 16వ సారి చూసినపుడు సినిమా నచ్చింది అని అఖిల్ తెలిపారు.
‘అఖిల్' ప్లాప్ తర్వాత లెక్కలేనన్ని కథలు విన్నాను. కాస్త గ్యాప్ వచ్చినా సరే గర్వపడే సినిమానే చేయాలనుకొన్నా. పర్సనల్ గా కూడా ఆ కథ నాకు కనెక్ట్ అయ్యేలా ఉండాలనుకున్నాను. అలాంటి కథ విక్రమ్‌ కె కుమార్‌ వినిపించారు. ‘హలో' నా జీవితాన్ని మార్చే సినిమా అవుతుంది అని అఖిల్ తెలిపారు.
నాకు స్పోర్ట్స్‌ అంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే కొన్నిసార్లు వ్యక్తిగతంగా తీసుకొంటుంటా. నాకు, నాన్నకి సచిన్‌, విరాట్‌ కోహ్లిలంటే ఇష్టం. నేను మాసం ఎక్కువ తింటుండటంతో సచిన్‌ బెండకాయ తింటాడని అబద్దం చెప్పి అమ్మ నాతో నాతో బెండకాయ తినిపించింది. సచిన్‌ అంటే అంత పిచ్చి నాకు. నాకు చిరంజీవి డాన్స్‌ అంటే పిచ్చి. ‘అమ్మడు కుమ్ముడూ' పాటని ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. ఆ లక్షణాలే రామ్‌చరణ్‌కి వచ్చాయి. ఇక ఎన్టీఆర్‌ డాన్స్‌ గురించి చెప్పేదేముంది? తనని పట్టుకోవడం చాలా కష్టం.... నాకు డాన్స్ చేయడం పెద్దగా రాదు. అథ్లెట్ బాడీ కాబట్టి బాడీ ఎలా అంటే అలా బెండ్ అవుతుంది. అలా ఏదో మేనేజ్ చేస్తున్నాను అని కొన్ని సరదా విషయాలను అఖిల్ తెలిపారు.