సారీ రా..అంటూ అఖిల్ కి షాకిచ్చిన నాగ్ !

  • 6 years ago
A candid and hilarious Twitter chat with son and lead actor of ‘HELLO’ Akhil Akkineni, Akkineni Nagarjuna unveiled the teaser of the first single from the film.

నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ త్వరలో 'హలో' మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన 'హలో' ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ప్రమోషన్లో భాగంగా సినిమాలోని వెడ్డింగ్ సాంగ్ టీజర్ నాగార్జున విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ టీజర్ విడుదల సందర్భంగా నాగార్జున, అఖిల్ మధ్య ట్విట్టర్లో ఫన్నీ చిట్ చాట్ జరిగింది.
"హలో ఆడియో ఫైనల్ మిక్స్ విన్నాను, అన్ని పాటలు చాలా బావున్నాయి' అని నిన్న సాయంత్రం ట్విట్టర్ ద్వారా తెలిపిన అఖిల్, బుధవారం సినిమాలోని ఓ సాంగ్ టీజర్ మీకోసం రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అఖిల్ చేసిన ఈ ట్వీట్ మీద నాగార్జున స్పందిస్తూ.... సాంగ్ లాంచ్ చేయబోతున్నట్లు నువ్వు నాకు చెప్పలేదేంటి? నువ్వు విడుదల చేయబోతున్న సాంగ్ ఇదేనా? ఈ సాంగ్ చిత్రీకరించిన సెట్ చాలా అందంగా ఉంది అంటూ.... నాగార్జున ఓ ట్వీట్ చేశారు.

Recommended