YSRCP Senior Leader Quits Jagan Party | Oneindia Telugu

  • 6 years ago
The YSR Congress Party received a jolt in the district, the home turf of Chief Minister N. Chandrababu Naidu, following the resignation of the party’s senior leader and former ZP chairman M. Subramanyam Reddy on Sunday.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చిత్తూరు జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు సుబ్రహ్మణ్య రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ ఓ వైపు పాదయాత్ర చేస్తుండగా మరోవైపు ఆ పార్టీకి కొందరు నేతలు రాజీనామా చేస్తున్నారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా కీలక నేతగా ఉన్న సుబ్రహ్మణ్య రెడ్డి రాజీనామా చేయడం గమనార్హం.
సుబ్రహ్మణ్యం రెడ్డి కుప్పం శాసనసభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు పోటీ చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆయన కుప్పం నుంచి మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్నారు.కుప్పం మండలం తంబిగానిపల్లెలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం తన మద్దతుదారులు, అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. సుబ్రహ్మణ్య రెడ్డి రాజీనామా చేయడంతో వైసీపీ నేతలు షాక్‌కు గురయ్యాయి.

Recommended