సెక్సీ దుర్గకు చేదు అనుభవం.. దర్శకుడి ఫైర్

  • 7 years ago
The curtain came down on the International Film Festival of India (IFFI) in Goa without the film 'S Durga' by Kerala filmmaker Sanal Sasidharan being screened despite a Kerala high court order as the Central Board of Film Certification (CBFC) rejected the film hours before the event ended.

కేరళ హైకోర్టు ఆదేశించినప్పటికీ సెక్సీ దుర్గ (ఎస్ దుర్గ) చిత్రానికి చేదు అనుభవం తప్పలేదు. భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో (ఇఫీ) ఎస్ దుర్గ చిత్రాన్ని ప్రదర్శించకుండా అడ్డుకోవడంలో కేంద్ర ప్రభుత్వం సఫలైమంది. జ్యూరీ ఎంపిక చేసినా ఎస్ దుర్గ చిత్రాన్ని ఇఫీలో ప్రదర్శించే జాబితా నుంచి తొలగించడం వివాదంగా మారింది. తమ నిర్ణయాన్ని వ్యతిరేకించారన్న కారణంతో జ్యూరీ సభ్యులు రాజీనామా చేయడం తెలిసిందే. కొన్ని వివాదాల మధ్య భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మంగళవారం (నవంబర్ 29న)తో ముగిసింది.
ఎస్ దుర్గ చిత్రం వివాదంలో ఇరుక్కోవడంతో చిత్ర దర్శకుడు సనల్‌కుమార్ శశిధరన్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిస్తూ ఎస్ దుర్గ చిత్రాన్ని ఇఫీలో ప్రదర్శించాలని ఆదేశించింది. చలన చిత్రోత్సవాలు ముగియడానికి ఒకరోజు ముందు (సోమవారం నాడు) ఇఫీ జ్యూరీ ఆ చిత్రాన్ని వీక్షించింది.

Recommended