Giddi Eswari Dealing With TDP : Video Evidence Out | Oneindia Telugu

  • 6 years ago
YSRCP President Jagan's media revealed a video evidence which contain Paderu MLA Giddi Eswari dealing with TDP, she got Ministry offer from that party

వైసీపీ ఎమ్మెల్యేలను వరుసపెట్టి పార్టీలో చేర్చుకుంటున్న టీడీపీ.. పైకి చెప్పేదొకటి, లోపల చేసేదొకటి అన్న విషయాన్ని సాక్షి బయటపెట్టింది. అభివృద్దిని చూసి పార్టీలో చేరుతున్నారని టీడీపీ చెబుతుంటే.. నియోజకవర్గాల అభివృద్ది కోసమే పార్టీ మారుతున్నామని జంపింగ్ నేతలు చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పార్టీ మారిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా అదే మాట చెప్పారు.
కానీ ఆమె మాటల వెనుక అసలు మతలబు వేరే ఉందన్నది సాక్షి మరియు వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న వాదన. గిడ్డి ఈశ్వరి పార్టీ మార్పు వెనుక ఉన్న అసలు విషయాలు సాక్షాధారాలతో సహా వారికి చిక్కినట్టు తెలుస్తోంది
పార్టీ మారే ముందు నియోజకవర్గంలోని కార్యకర్తలు, స్థానిక నేతలతో గిడ్డి ఈశ్వరి సమాలోచనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు ఓ వీడియో రూపంలో సాక్షికి చిక్కినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ వీడియో టేపుల్లో ఆమె ఏం మాట్లాడారంటే..' చంద్రబాబు అంటే మాకేమీ ఇష్టమని వెళ్లడం లేదు.. మామూలుగా అయితే వెళ్లాలని లేదు.. ఆ పార్టీలోకి వెళ్లడం మాకు ఇష్టం లేదు. డిఫర్‌ అవడం వల్లనే వెళ్లాల్సి వస్తోంది.. నేనేం చెబుతున్నానంటే.. మంత్రివర్గ విస్తరణ రేపు జరిగితే.. రేపు.. ఎల్లుండి జరిగితే ఎల్లుండి మంత్రి పదవి ఇస్తామన్నారు.. జాయిన్‌ అయి వెళ్లిన వెంటనే మంత్రి ఇవ్వలేరు కాబట్టి ఎస్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కేబినెట్‌ హోదాతో ఇస్తామన్నారు. రాష్ట్రంలోని మంత్రికి ఉన్నటువంటి పవర్స్‌ అన్నీ ఇస్తామన్నారు కాబట్టే వెళ్తున్నా' అంటూ చెప్పుకొచ్చారట.

Recommended