అనుష్క-కోహ్లి డాన్స్.. వైరల్ వీడియో
  • 6 years ago
After a star-studded party for close friends and a mehendi ceremony, the newlyweds Zaheer Khan and Sagarika Ghatge hosted their wedding reception on Monday evening at the Taj, Colaba.

బాలీవుడ్ హీరోయిన్ సాగరికను క్రికెటర్ జహీర్ ఖాన్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరి వెడ్డింగ్ రిసెప్షన్ సోమవారం సాయంత్రం ముంబై, కోలాబాలోని తాజ్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు క్రికెట్ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. జహీర్ ఖాన్ రాయల్ బ్లూ డ్రెస్ ధరించగా, సాగరిక గోల్డెన్ బెనారసి లెహంగాలో అందంగా మెరిసిపోయింది.
సాగరిక-జహీర్ నవంబర్ 23న చాలా సింపుల్ గా కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. నవంబర్ 27న సాయంత్రం గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ క్రికెటర్లంతా హాజరై సందడి చేశారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, భార్య హజెల్ కీచ్ తో కలిసి యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సానియా మీర్జా, అజిత్ అగార్కర్ తదితరులు హాజరయ్యారు.
జహీర్ ఖాన్-సాగరిక వెడ్డింగ్ రిసెప్షన్‌లో విరాట్ కోహ్లి, అనుష్క శర్మ జంట డాన్స్ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.జహీర్ ఖాన్‌తో కోహ్లికి మంచి అనుబంధం ఉంది. అందుకే తన ప్రియురాలు అనుష్కతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు.
Recommended