బిత్తిరి సత్తి దాడిలో జై పవన్ కల్యాణ్.. వివాదంలో కొత్త ట్విస్ట్ !
  • 6 years ago
Famous Anchor Bittiri Satti attacked by Unidentified man. Attacker was alleged that he was hurted the way Bittiri Satti was projecting the Telangana Language. I will not spare anybody if Telangana language misused.

ప్రముఖ యాంకర్, నటుడు బిత్తిరి సత్తిపై ఓ వ్యక్తి దాడి చేయడం మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. దాడికి గురైన బిత్తిరి సత్తికి పలువురు సానుభూతితో మద్దతు తెలిపారు. అయితే ఈ వివాద ఘటనలో పవన్ కల్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు చేసినట్టు వార్తలు వచ్చాయి. మీడియాలో ఈ అంశం కీలకం కావడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ దాడి వెనుక ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలో చర్చ జరుగుతున్నది. తెలంగాణ యాస, భాషతో ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో తీన్మార్ కార్యక్రమంలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిత్తిరి సత్తిపై సోమవారం ఉదయం దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే దాడి చేసిన వ్యక్తి పోలీసులతో మాట్లాడుతూ తెలంగాణను అమితంగా అభిమానించే వ్యక్తిగా నేను చాలా మనస్తాపానికి గురయ్యాను. అందుకే అతడినపై దాడి చేశాను అని మణికంఠ అన్నారు.
బిత్తిరి సత్తిపై దాడికి పాల్పడిన వ్యక్తి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం ఎవరికీ అంతుపట్టని విషయంగా మారింది. బిత్తిరి సత్తిపై దాడికి, పవన్ కల్యాణ్‌కు సంబంధమేమిటి అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది.
అయితే బిత్తిరి సత్తి దాడి వెనుక కారణాలపై సదరు ఛానెల్ ఆరా తీస్తున్నది. దాడికి పాల్పడిన మణికంఠకు జనసేనతో ఏమైనా సంబంధం ఉందా? లేక అతను పవన్ కల్యాణ్ అభిమానా? అనే కోణంలో వివరాలను సేకరిస్తున్నారు.
Recommended