Ys Jagan implementing tdp strategy

  • 6 years ago
Ysrcp planning to strengthen party in vizag district. Ys Jagan implementing tdp strategy in vizag district.

తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని వైసీపీ కూడ అవలంభించాలని చూస్తోంది. ఇతర పార్టీల నుండి బలమైన నేతలను తమ పార్టీలోకి ఆహ్వనించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.కొత్తగా పార్టీలో చేరే నేతలకు తాము కోరుకొన్న చోట పోటీ చేసేందుకు ఆవకాశాలు కల్పించాలని యోచిస్తున్నట్టు సమాచారం. విశాఖ జిల్లాలో అధికార పార్టీ వ్యూహలకు వైసీపీ ప్రతి వ్యూహలను రచిస్తోంది.
అయితే ఇతర పార్టీల నుండి చేరుతున్న నేతలకు వైసీపీ స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి టిక్కెట్లను కేటాయించనున్నట్టు హమీలు ఇస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. విశాఖ జిల్లాలో ఓ మాజీ మంత్రిని పార్టీలో చేర్చుకొనేందుకు జగన్ సానుకూలంగా ఉన్నారని ఆ పార్టీ నేతల్లో ప్రచారంలో ఉంది.అయితే ఈ కారణంగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని ఎమ్మెల్యే స్థానంలో కాకుండా పాడేరు ఎంపీ స్థానం నుండి బరిలో దింపాలని జగన్ యోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పాడేరు ఎంపీ స్థానం నుండి పోటీ చేసేందుకు గిడ్డి ఈశ్వరీ సానుకూలంగా లేరనే ప్రచారం కూడ ఉంది. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ఆ సమయంలో చోటు చేసుకొనే రాజకీయ పరిస్థితులను బట్టి పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం లేకపోలేదంటున్నారు నేతలు.

Recommended