మెగాస్టార్‌కు ఈ అవార్డు ఎలా ఇస్తారండి ? -బండ్ల గణేష్

  • 7 years ago
Tollywood producer Bandla Ganesh has criticised jury for announcing Raghupathi Venkaiah Award to megastar Chiranjeevi. He stated that Raghupathi Venkaiah Award is given to those personalities, who have become inactive in the film industry after decades of experience

అంశంపై ఒక ప్రముఖ మీడియా సంస్థ ప్రత్యేక చర్చను పెట్టింది. దీనికి.. తెలుగు సినీ నిర్మాత నల్లమలుపు బుజ్జి.. సి. కల్యాణ్.. బండ్ల గణేశ్.. తదితరులు చర్చలో పాల్గొన్నారు. నంది అవార్డుల ఎంపికలో కమ్మ లాబీయింగ్ ప్రభావం చూపిందన్న భారీ ఆరోపణతో పాటు.. కావాలంటే జ్యూరీలో ఉన్న వారి పేర్లు ఏ సామాజిక వర్గానికి చెందిన వారో లెక్క చూడండంటూ బాహాటంగా చెప్పేయటం కనిపించింది.
బండ్ల గణేష్ చిరంజీవికి రఘుపతి వెంకయ్య అవార్డు ఇవ్వటం పై గణేష్ తప్పు పట్టాడు, అసలు చిరు రిటైర్ అయ్యాడు అనుకుంటున్నారా? ఈ అవార్దు ఏ ఉద్దెశం తో ఇచ్చారు? అంటూ ప్రశ్నించాడు...
"ఎన్టీఆర్ పురస్కారాన్ని రజనీకాంత్.. కమల్ హాసన్ కు ప్రకటించారు. బాగుంది. మరి.. చిరంజీవికి ఎందుకు ప్రకటించలేదు. సాధారణంగా రఘుపతి వెంకయ్య అవార్డుని రిటైర్ అయిన వాళ్లకు.. ఇండస్ట్రీలో వారి జర్నీ దాదాపుగా ముగిసిన వారికి ఇస్తుంటారు. సినిమాలకు చాలాకాలంగా దూరమైన కృష్ణంరాజుకు గతంలో ఇచ్చారు.
అదే రీతిలో ఈశ్వర్‌కు ఇచ్చారు. తొమ్మిదేళ్లు సినిమాలకు దూరంగా ఉండి ఖైదీ నెంబరు 150తో దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయిల కలెక్షన్ తో దూసుకెళ్లిన మెగాస్టార్‌కు ఈ అవార్డు ఎలా ఇస్తారండి? మధ్యలో ఆగినా.. మరో పదేళ్లు తనకు తిరుగులేదన్న విషయాన్ని ఫ్రూవ్ చేసిన చిరంజీవికి అలాంటి అవార్డు ఇస్తారా?

Recommended