గుండెను పిండేసేలా.., వివాహిత ఆత్మహత్య | Oneindia Telugu

  • 7 years ago
A married woman lost life in Mancherial town due to the dowry problems of their husband family

'బావా.. మీ అమ్మానాన్నలకు నేనంటే ఇష్టంలేదు. నీకు మీ అమ్మానాన్నే కావాలి. కనీసం భార్యని మీ అమ్మా నాన్న అనే మాటలేవీ పట్టించుకోవు. నీకు మీ వాళ్లు ఒక కోటీశ్వరుల అమ్మాయితో పెళ్లి చేస్తారు. చేసుకో. అది కూడా మీ అక్కకు ఇష్టమైన సంబంధం చేసుకో.' ఇదీ ఆత్మహత్యకు ముందు ఓ వివాహిత ఆవేదన. అదనపు కట్నపు వేధింపులకు ఓ వివాహిత బలైపోయింది. తనతో పాటు నాలుగేళ్ల కూతురిని కూడా ఉరివేసి చంపేసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆత్మహత్యకు ముందు బాధితురాలు రాసిన లేఖ కంటతడి పెట్టించేలా ఉంది.
మంచిర్యాల పట్టణానికి చెందిన కేసిరెడ్డి మోహన్‌రెడ్డి-పద్మ దంపతుల కుమారుడు రామకృష్ణారెడ్డికి, సమీపంలోని ఊరు శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన రాంరెడ్డి-అరుణ దంపతుల కూతురు విజ్జూలతకు 2012లొ వివాహం జరిగింది. పెళ్లి సమయంలో విజ్జూలత కుటుంబం రూ.15లక్షల కట్నంతో పాటు ఇతర లాంఛనాలు బాగానే చేశారు.వివాహం జరిగిన ఏడాదికి రామకృష్ణారెడ్డి-విజ్జూలతలకు క్రిషిక జన్మించింది. ప్రస్తుతం స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఆమె చదువుతోంది. ఇకపోతే మోహన్‌రెడ్డి తండ్రికి ఊరు శ్రీరాంపూర్‌ సమీపంలో ఐఓసీ పెట్రోల్‌బంక్‌ ఉంది. ఇందులోనే పనిచేస్తున్న రామకృష్ణారెడ్డి.. నెలవారీ ఖర్చులకు గాను రూ.7వేలు జీతంగా తీసుకుంటున్నాడు.

Recommended