Krishna Boat Tragedy : Shocking Facts, తీగ లాగితే డొంకంతా కదిలింది | Oneindia Telugu
  • 6 years ago
Kakinada is famous for boats making, approximately fifteen boats are made here in every month, but some people are making quality less boats for very less amount of 5 laks instead of 20 laks.

కృష్ణా నదిలో బోటు విషాదం రాష్ట్రంలో పర్యాటక రంగానికి పెద్ద సవాల్ గా మారింది. అధికారుల అక్రమాలకు తోడు రాష్ట్రంలో తయారవుతున్న నాసిరకం బోట్లు కూడా పర్యాటకులకు ప్రమాదకరంగా మారాయి. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు.. కృష్ణా నదిలో బోటు ప్రమాదం తర్వాత పలు నివ్వెరపోయే విషయాలు బయటపడుతున్నాయి. పర్యాటక రంగంలో అక్రమాలే కాదు.. ఆఖరికి బోట్ల తయారీలోను నాసిరకానికే మొగ్గుచూపడం పర్యాటకుల ప్రాణాల మీదకు తెస్తోంది. డబ్బులకు కక్కుర్తిపడి కొంతమంది యజమానులు నాసిరకం బోట్లు తయారుచేయిస్తున్నారు. ఇటీవలి విషాదం సంఘటనకు నాసిరకం బోటును ఉపయోగించడం కూడా ప్రమాదానికి ఒక కారణంగా చెబుతున్నారు. ఈ బోటు నాసిరకమనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీలో బోట్లకు తయారీకి కాకినాడ, విశాఖపట్నంలోని నక్కపల్లి ప్రసిద్ది. ఈ రెండు చోట్ల మాత్రమే బోట్లను తయారుచేస్తుంటారు. అందులోను కాకినాడలో తయారయ్యే బోట్లకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. మత్స్యకారులు తమ బోట్ల కోసం రూ.20లక్షల దాకా వెచ్చించి బోట్లు తయారుచేయించుకుంటుంటారు. కానీ తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు ఆర్జించాలన్న కొంతమంది యజమానులు కక్కుర్తిపడుతున్నారు. కేవలం రూ.5లక్షలకే నాసిరకం ఫైబర్ బోట్లను తయారుచేయించి పర్యాటక రంగానికి వినియోగిస్తున్నారు. ఈ ఫైబర్ బోట్లే కొంపముంచుతున్నాయి.
Recommended