ASEAN Summit : Modi And Other Leaders Pose For Family Picture | Oneindia Telugu

  • 6 years ago
Prime Minister Narendra Modi and other prominent leaders posed for a group picture at the ASEAN Summit 2017 in Manila on Sunday. PM Modi later met Philippines President Rodrigo Duterte, Japanese PM Shinzo Abe and U.S. President Donald Trump

ఫిలీప్పీన్స్‌లోని పసాయ్‌లో జరిగే ఏసియాన్‌ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన వివిధ దేశాధినేతలంతా ఆదివారం రాత్రి ఆహుతులను ఆకట్టుకున్నారు. 'ఏసియాన్' స్వర్ణోత్సవాల సందర్భంగా ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టే ఇచ్చిన విందుకు హాజరైన అధినేతలు 'బరాంగ్‌ తగలాగ్‌' అనే ఫిలీప్పీన్స్‌‌ జాతీయ చొక్కాను ధరించడం గమనార్హం. ఏసియాన్ సదస్సులో పాల్గొనడంతోపాటు ఆ దేశంలో మూడు రోజుల పర్యటన కోసం వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం మనీలా చేరుకున్నారు. 1981లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత ఫిలిప్పీన్స్ లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా నరేంద్రమోదీ రికార్డు నెలకొల్పారు.
ఆదివారం సాయంత్రం వియత్నాం నుంచి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను ప్రధాని మోదీ కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. చైనా ప్రధాని లీ కియాంగ్‌,రష్యా ప్రధాని డిమిట్రీ మెద్వెదేవ్‌, మలేషియా ప్రధాని నజీబ్‌రజాక్‌, జపాన్‌ ప్రధాని షింజోఅబే, ఫిలీప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టేతోనూ ప్రధాని మోడీ ఆత్మీయంగా కరచాలనం చేసి పలకరించారు. చైనా ప్రధాని లీతో మోడీ ఆత్మీయంగా సంభాషించినట్టు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. పలువురు నేతలతో సమావేశమైన దృశ్యాలను ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Recommended