జగన్‌కు గట్టి షాక్: మరో వికెట్ టీడీపీలోకి నెక్స్ట్ ఏంటి జగన్ ? | Oneindia Telugu
  • 6 years ago
MLA Vantala Rajeswari joined in TDP, She criticized Jagan over the issue of assembly boycott
కార్యకర్తలతో చర్చించాకే వైసీపీని వీడి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తెలిపారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని జగన్ తీసుకున్న నిర్ణయం తనతో పాటు చాలామంది ఎమ్మెల్యేలకు నచ్చలేదని అన్నారు. శనివారం ఉదయం టీడీపీలో చేరిక అనంతరం ఆమె మాట్లాడారు. పార్టీ వీడటంపై స్పందిస్తూ.. తన నియోజకవర్గంలో ఎస్టీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, వారంతా తనపై ఆశలు పెట్టుకున్నారని అన్నారు. అయితే దురదృష్టవశాత్తూ జగన్, తన నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టకపోగా.. అసెంబ్లీలో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని అన్నారు.
ఎన్నికలకు ఇంకో ఏడాదిన్నర సమయమే మిగిలి ఉన్న తరుణంలో.. అసెంబ్లీని బహిష్కరిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్దిపై చంద్రబాబు తనకు భరోసా ఇచ్చారని తెలిపారు. త్వరలోనే నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టి ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తానని అన్నారు.
Recommended