Vijayawada : జనంపైకి దూసుకెళ్లిన బస్సు : Video

  • 7 years ago
Vijayawada : Major Bus Mishap held in Vijayawada. 2 people lost life. As brakes fail, driver rams into bus on people.

విజయవాడ : బస్సు ప్రమాదాలు ఎక్కడోచోట రోజు జరుగుతూనే ఉన్నాయ్. బుడమేరు వంతెన వద్ద ఓ ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం బీభత్సం సృష్టించింది. గవర్నర్‌పేట డిపోకు చెందిన ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సు గన్నవరం వాంబే కాలనీ నుంచి బస్టాండ్‌ కు వెళ్తోంది. బుడమేరు వంతెన వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా బ్రేకులు ఫెయిలై బస్సు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. ఓ ఆటో, నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. మృతులను ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐతే బ్రేకులు ఫెయిలవ్వడం అనుకోకుండా జరిగిందా లేదంటే డ్రైవర్ నిర్లక్యం గా బ్రేకులు కండిషన్ పట్టించుకోలేదా అన్నది తెలియాల్సి ఉంది.

Recommended