The Meteorological Department has predicted that there is a possibility of heavy rains in several districts of Telangana for the next two days. It has been said that there is a possibility of rains especially in the southern and eastern Telangana districts. It has already rained in several districts. Heavy rains lashed several parts of Hyderabad on Thursday evening. Weather Update. వచ్చే రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉప్పల్, తార్నాక, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, మదాపూర్, హైటెక్ సిటీ, బోరబండ, మోతినగర్ వర్షం కురిసింది. వచ్చే రెండు రోజులు నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. #weatherupdate #telanganarains #hyderabad
Also Read
తీవ్ర అల్పపీడనం, నాలుగు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/low-pressure-in-bay-of-bengal-brings-heavy-rains-in-telugu-states-yellow-alert-issued-443997.html?ref=DMDesc