HCU భూములను అడుగు సైతం తీసుకోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుత భూమికి బదులుగా వర్సిటీకి గతంలోనే 397 ఎకరాలు కేటాయించినట్లు మంత్రులు తెలిపారు. కోట్లాది రూపాయల విలువైన భూములను ప్రైవేటు వ్యక్తుల నుంచి కాపాడి...యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. HCU పరిధిలో జీవవైవిధ్యాన్ని కాపాడుతామని స్పష్టం చేసిన అమాత్యులు....ప్రభుత్వ పనులకు అడ్డుతగిలితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు....