Allu Aravind On Thandel Movie piracy Issue : అంతా తెలిసే, కావాలని చిత్రాన్ని పైరసీ చేస్తున్నారని ‘తండేల్’ సినిమా నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నాగచైతన్య కథానాయకుడిగా, సాయిపల్లవి హీరోయిన్గా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని పైరసీ చేసి ఆన్లైన్లో పెట్టినట్లుగా సమాచారం. అంతేకాదు, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులోనూ ప్రదర్శించారు. దీనిపై చిత్ర నిర్మాతలు బన్ని వాసు, సమర్పకులు అల్లు అరవింద్ ప్రెస్మీట్లో మాట్లాడారు.