SADAREM CERTIFICATE VERIFICATION: బోగస్ సదరం (Software for Assessment of Disabled for Access Rehabilitation and Empowerment) సర్టిఫికెట్ల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హులైన వారికి పింఛన్లు అందజేసి అనర్హులైన వారిపై వేటు వేసి కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దివ్యాంగుల పేరిట దొంగ సర్టిఫికెట్లు పొంది పింఛన్లు తీసుకుంటున్నవారి గురించి విచారణ చేపట్టింది.