Stella Ship Case Updates : కాకినాడ తీరానికి 9 నాటికల్ మైళ్ల దూరంలో లంగరు వేసిన స్టెల్లా ఎల్ పనామా షిప్ వద్దకు అధికారుల బృందం నేడు మరోసారి వెళ్లనుంది. ఆఫ్రికాలోని బెనిన్ దేశ వాణిజ్య కేంద్రం కోటోనౌ పోర్టుకు కాకినాడ యాంకరేజి పోర్టు నుంచి వెళ్లాల్సిన ఈ నౌకలో సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్‌కు చెందిన 1320 టన్నుల పేదల బియ్యాన్ని జిల్లా యంత్రాంగం గుర్తించింది. వాతావరణం అనుకూలిస్తే రెండు రోజుల్లో వాటిని ఒడ్డుకు చేర్చనున్నారు.