Allu Arjun Comments on His Arrest : జైలు నుంచి విడుదలైన తరువాత జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. నాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, చట్టానికి కట్టుబడి ఉంటానని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నానన్నారు.