Nandamuri Balakrishna Rakhi Celebrations With Family : నందమూరి ఇంటా రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ తన సోదరీమణులు లోకేశ్వరి, పురందేశ్వరి, భువనేశ్వరిలతో రాఖీ కట్టించుకున్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి బాలయ్యను ఆట పట్టించారు. పదేళ్ల వయస్సులో రాఖీ కడితే కేవలం పది పైసలు మాత్రమే ఇచ్చాడంటూ బాల్య స్మృతులను గుర్తుచేసుకున్నారు. అలాగే కాళ్లకు దణ్ణం సరిగా పెట్టు అంటూ పురందేశ్వరి మరోమారు బాలయ్యను చమత్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ సందడి చేస్తొంది.