TG Assembly Debates on Electricity : సింగరేణిలో దాదాపు రూ.10, 12 వేల కోట్ల అవినీతి జరిగిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని ఆరోపించారు. గతంలో కూడా తాను ఇదే విషయం చెప్పానని, విచారణ కమిటీ వేయాలని అడిగినట్లు గుర్తుచేశారు. విద్యుత్‌పైనే కాదు సింగరేణి సమస్యలపై మాట్లాడాలని ఆయన శాసనసభలో విద్యుత్ రంగంపై జరుగుతున్న చర్చలో డిమాండ్ చేశారు. సింగరేణిలో జరిగిన అవకతవకలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.