ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ ఎంఎల్ఎస్ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. పంపిణీ చేసే సరకుల తూకం పరిశీలించారు. అలానే విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.