గెలిచినా తగ్గిన ముర్ము ఓట్లు,ఓడినా పెరిగిన యశ్వంత్ సిన్హా ఓట్లు *National | Telugu OneIndia
  • 2 years ago
Droupadi Murmu, a tribal BJP leader and former Jharkhand Governor, has been elected as the 15th President of India | రాష్ట్రపతి పోరులో ద్రౌపదీ ముర్ము మొత్తం 2824 ఓట్లు సాధించారు. ఈ మొత్తం ఓట్ల విలువ 6,76,803గా లెక్కించారు. అంటే ఇది పోలైన మొత్తం ఓట్లలో 64.03 శాతంగా నిర్దారణ అయింది. దీంతో ముర్ము దాదాపు వెయ్యి ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి రాష్ట్రపతి పదవి చేపట్టబోతున్నారు. అయితే ముర్ము కంటే ముందు రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్ నాథ్ కోవింద్ తో పోలిస్తే మాత్రం ఆమెకు తక్కువ ఓట్లే పడ్డాయి. 2017లో జరిగిన రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్‌డిఎ అభ్య‌ర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు 7,02,044 (65.61 శాతం) ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన కంటే ముర్ము వెనుకబడినట్లయింది.అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాకు ఆశించిన దాని కంటే ఎక్కువ ఓట్లే వచ్చాయి. విపక్షాల్లో ఐక్యత లేకపోవడం, ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినా, తటస్ధ పార్టీలు కలిసి రాకపోయినా యశ్వంత్ సిన్హాకు
మాత్రం ఎక్కువ ఓట్లే పడ్డాయి.


#DraupadiMurmu
#15thPresidentofIndia
#yashwantsinha