సికింద్రాబాద్‌లో రైళ్లకు నిప్పు.. హై టెన్షన్

  • 2 years ago
కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్‌‌ సెగ హైదరాబాద్‌కూ తాకింది. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో యువకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అగ్నిపథ్‌ను రద్దు చేసి యథావిధిగా ఆర్మీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ యువకులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత కనిపించింది. ఆందోళనకారులు స్టేషన్‌లో రైళ్లకు నిప్పు పెట్టారు. రైలు పట్టాలపై పార్సిల్‌ సామాన్లు వేసి వాటినీ తగలబెట్టారు. రైల్వేస్టేషన్‌లో ఉన్న దుకాణాలు, ఇతర స్టాళ్లు, డిస్‌ప్లే బోర్డులను ధ్వంసం చేశారు.

Recommended